Thursday, February 27, 2020

బలవంతంగా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కించి.. చంద్రబాబును పంపిన విశాఖ పోలీసులు.. ముగిసిన హైడ్రామా..

అధికార వైసీపీ శ్రేణుల అరుపులు.. కేకలు.. కోడుగుడ్లు, చెప్పులతో దాడులు.. పెట్రోల్ బాటిళ్లతో ఆత్మహత్యాయత్నం బెదింరింపుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తలపెట్టిన ఉత్తరాంధ్ర పర్యటన రద్దయింది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆయనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. సాయంత్రం చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు.. రాత్రికి ఆయనను విమానం ఎక్కించడంతో హైడ్రామా ముగిసినట్లయింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32x38sZ

Related Posts:

0 comments:

Post a Comment