Sunday, July 11, 2021

Rains in Telangana : హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు...

హైదరాబాద్‌ సహా తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని ముషీరాబాద్,సికింద్రాబాద్,అడిక్‌మెట్,నల్లకుంట,కేపీహెచ్‌బీ,నిజాంపేట్,బాచుపల్లి,బాలానగర్,కుత్భుల్లాపూర్,మాదాపూర్,కొండాపూర్,మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్,గచ్చిబౌలి తదిరత ప్రాంతాల్లో ఆదివారం(జులై 11) ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున తేలికపాటి చినుకులు పడగా.. మధ్యాహ్నం సమయానికి భారీ వర్షంగా మారింది. ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లోనూ ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14.9సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36soURx

Related Posts:

0 comments:

Post a Comment