శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YZt1Bt
Friday, August 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment