తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా,ఆర్థికంగా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుని.. తెలంగాణలోని నాలుగు జిల్లాలైన రంగారెడ్డి,నల్గొండ,పాలమూరు,ఖమ్మం ప్రజల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగేంతవరకు కేసీఆర్ స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3buxT4C
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment