Friday, May 31, 2019

వామ్మో ఏంటా వాడకం..! కరెంట్ కే షాక్ ఇస్తున్న నగర వాసులు..!!

హైదరాబాద్‌ : వామ్మో.. నగరంలో విద్యుత్ ను నీళ్ల కన్నా ఘోరంగా వాడేస్తున్నారు. నగరంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ వినియోగం నమోదవుతోంది. సూర్య ప్రతాపానికి 24 గంటలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు గిర్రున తిరుగుతున్నాయి. గ్రేటర్‌లో గురువారం అత్యధికంగా 3391 మెగావాట్ల రికార్డు స్థాయి గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. బుదవారం 3324 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌తో పాటు 71.05 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం రికార్డయ్యింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MhICZ3

0 comments:

Post a Comment