హైదరాబాద్: తెలంగాణ రైతన్నకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మండువేసవిలో కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలకు భారీగా నష్టం కలిగించాయి. ఖమ్మం, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, కుమురంభీం ఆసిఫాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వానలు పడటంతో రైతులు బెంబేలెత్తిపోయారు. కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఇంటి పైకప్పులు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగి ప్రవహించాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UNjYTK
Saturday, April 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment