Saturday, July 3, 2021

63 మంది వార్డు వాలంటీర్లకు షాక్... విధుల్లో నుంచి తొలగింపు... వ్యాక్సిన్ తీసుకోనందుకు...

కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన 63 మంది వార్డు వాలంటీర్లపై వేటు పడింది. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని కారణంగా మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు వారిని విధుల్లో నుంచి తొలగించారు. వాలంటీర్లు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం సూచించినప్పటికీ... నిర్లక్ష్యంగా వ్యవహరించి వేటుకు గురయ్యారు. వీరి స్థానంలో కొత్త వాలంటీర్లను నియమించేందుకు సోమవారం(జులై 5) నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ykFWwL

0 comments:

Post a Comment