Friday, October 16, 2020

రఘురామకృష్ణరాజుకు షాక్: పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి తొలగింపు

న్యూఢిల్లీ: సీబీఐ కేసు నేపథ్యంలో వైయస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి ఆయనను తొలగించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ కొత్త ఛైర్మన్‌గా వైయస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వచ్చాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nREWvI

Related Posts:

0 comments:

Post a Comment